Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:39 AM
నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరఫునుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక, భారత రాష్ట్ర సమితి తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో బీజేపీ తరఫునుంచి పోటీ చేసేవారిలో జూటురు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆ కారణంతో మళ్లీ ఆయనకే సీటు ఇచ్చే అవకాశం ఉందని టాక్.
తొలిసారి జూబ్లీహిల్స్‌లో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉండనున్నాయి. ఇలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచటం తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి కావటం విశేషం. ఇక, నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇక్కడే నామినేషన్లు దాఖలు చేయాలి. సికింద్రాబాద్ ఆర్‌డీవో సాయిరాం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
ఇవి కూడా చదవండి
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం