Share News

Jubilee Hills by-election: పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 07:37 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ ప్రక్రియపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా, గురువారం చాదర్‌ఘట్‌లోని విక్టోరియా ప్టేగ్రౌండ్‌ భవనంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ జరిగింది.

Jubilee Hills by-election: పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌

- ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముమ్మరం

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) నేపథ్యంలో నిర్వహణ ప్రక్రియపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా, గురువారం చాదర్‌ఘట్‌లోని విక్టోరియా ప్టేగ్రౌండ్‌ భవనంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌(RV Karnan), రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ జరిగింది. మొదటి దశ తనిఖీ పూర్తయిన ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించేందుకు కేటాయించారు.


city2.jpg

అంతకుముందు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కంట్రోల్‌ రూమ్‌(Model Code of Conduct Control Room)ను కర్ణన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసే వరకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్‌ రూమ్‌ బాధ్యులను ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ఎన్నికల ప్రవర్తన నియామవళి ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు.


city3.1.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 07:37 AM