Share News

Ravinder Rao: జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:31 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్‌ తరఫున శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

Ravinder Rao: జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..

- ఎమ్మెల్సీ రవీందర్‌రావు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు(MLC Takkellapalli Ravinder Rao) తెలిపారు. రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్‌ తరఫున శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఇంటింటికీ తిరిగి ‘కాంగ్రెస్‌ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. మహిళలు, వయోధికులు, దివ్యాంగులకు ఇస్తామన్న పింఛన్లు ఇవ్వడం లేదని, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగ కల్పన, విద్యార్థినులకు స్కూటీ ఇవ్వకుండా మభ్యపెడుతున్నదని దుయ్యబట్టారు.

city5.2.jpg


శ్రీరామ్‌నగర్‌లో...

శ్రీరామ్‌నగర్‌ బస్తీలో ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసకారి కాంగ్రెస్‌ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని,

city5.3.jpg


22 నెలలు అయినా ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ 10 ఏళ్లలో తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగన నిలిపారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.డి.మసూద్‌, ఎం.డి.నయీం, ఎం.డి.లియాఖత్‌ అలీ, కె.నరసింహారెడ్డి, ధనుజ, రఘు, ఉదయ్‌ కిరణ్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 09:31 AM