Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అడవి ప్రాంతంలో తొమ్మిదో రోజు కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కుల్గామ్‌లో భద్రతా దళాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద ఏరివేత చర్యలతో తమపైనా ప్రభావం పడుతోందని అఖాల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు నిండుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉగ్రవాద స్థావరంలో ఒక పిస్తోలు, రెండు మ్యాగ్జైన్‌లు, 12 గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 370వ అధికరణ రద్దయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డంప్ దొరికినట్టు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌కు చెందిన ప్రముఖ జాట్ నేత అయిన సత్యపాల్ మాలిక్ విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1974లో చౌదరి చరణ్ సింగ్ 'భారతీయ క్రాంతి దళ్' నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
Men Brave Rushing:ఆ నది సాధారణంగా లేదు. మొత్తం రాళ్లతో నిండిపోయి ఉంది. నీటిలో మునిగి ఉన్న రాళ్లు మొత్తం పాచిపట్టిపోయి ఉన్నాయి. పాచి పట్టిన రాళ్లపై కాలు పెడితే జారి కిందపడ్డం ఖాయం. కిందపడ్డపుడు తల రాళ్లకు తగిలితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.
అమిత్‌షా తన కసరత్తులో భాగంగా పలువురు బీజేపీ నేతలు, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్‌లతో సమావేశమైనట్టు కూడా చెబుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సైతం మంగళవారంనాడు ఎన్డీయే ఎంపీలతో కీలక సమావేశం జరుపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆపరేషన్‌లో సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కశ్మీర్ చిన్నారులను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వారి చదువులకయ్యే ఖర్చును రాహుల్ గాంధీ భరిస్తానని అన్నారు. ఇందుకు సంబంధించి తొలి విడత నిధులు బుధవారం విడుదల అవుతాయని కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తాజాగా వెల్లడించారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.