Vaishno Deve Yatra to Restart: వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం.. ఎప్పటి నుంచంటే
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:20 PM
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా రద్దయింది.
శ్రీనగర్: భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూలతలతో సస్పెండ్ అయిన మాతా వైష్ణోదేవి యాత్ర (Vaishno Devi Yatra) ఈనెల 14 నుంచి తిరిగి ప్రారంభమవుతోంది. రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయింది.
కాగా, వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు (SMVDB) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. యాత్ర వివరాలు, బుకింగ్స్ కోసం www.maavaishnodevi.orgను చూడాలని కోరింది.
యాత్రామార్గంలో విషాదం
త్రికూట హిల్స్‌పై ఆగస్టు 26న భారీగా కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో 36 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పట్నించి ఈ మార్గాన్ని మూసేశారు. దీంతో వేలాది మంది భక్తులు కట్రా పట్టణంలో నిలిచిపోయాడు. యాత్ర పునః ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ బోర్డు
యాత్రికుల కోసం అవసరమైన ఏర్పాట్లను ఆలయ బోర్డు చేపట్టింది. తాజా సమాచారం, బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. కొద్దిరోజులుగా జమ్మూ ప్రాంతంలో వాతావరణం మెరుగుపడింది. యాత్రామార్గంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం దుర్గామాత అవతారంగా భావించే వైష్ణోదేవిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
ఇవి కూడా చదవండి..
రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్
మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన
For More National News and Telugu News