Share News

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:44 PM

ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్‌ఖడ్‌ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్
Jagdeep Dhankar

న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) ఎట్టకేలకు పబ్లిక్‌లో కనిపించారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) శుక్రవారంనాడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేయగా, ఆ కార్యక్రమానికి ధన్‌ఖడ్ తన భార్యతో కలిపి విచ్చేశారు. రాజీనామా అనంతరం ఆయన బయట ప్రపంచానికి కనిపించడం ఇదే మొదటిసారి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఆహ్వానితుల జాబితాలో ధన్‌ఖడ్ ఉన్నారు.


సీపీ రాధాకృష్ణన్‌కు దగ్గరలో వెంకయ్యనాయుడు సీటు పక్కనే ధన్‌ఖడ్‌ కూర్చుని వారితో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు. కొత్త ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి మాజీ ఉప రాష్ట్రపతులను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.


ధన్‌ఖడ్ గత జూలై మొదట్లో తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను ఆయన తన రాజీనామా లేఖలో ప్రస్తవించారు. అప్పటి నుంచి ఆయన పబ్లిక్‌కు దూరంగా ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తన అధికారిక బంగ్లా ఖాళీ చేసి ఫాంహౌస్‌కు వెళ్లిపాయారు. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం రోడ్డులో టైప్-8 బంగ్లా కేటాయించారు.


ఇవి కూడా చదవండి..

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

For More National News and Telugu News

Updated Date - Sep 12 , 2025 | 04:47 PM