Share News

CP Radhakrishnan As Vice President: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Sep 12 , 2025 | 10:34 AM

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.

CP Radhakrishnan As Vice President: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం
CP Radhakrishnan

న్యూఢిల్లీ: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు NDA భాగస్వామ్యపక్షాల అభినందనలు తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 10:41 AM