Share News

Bagu Khan Killed: చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:29 PM

సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్‌లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు.

Bagu Khan Killed: చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం
Human GPS Bagu Khan

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో భద్రతా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. గురెజ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. చొరబాట్ల స్పెషలిస్ట్, 100కు పైగా చొరబాట్లకు కారకుడు, ఉగ్రవాద క్యాడెర్‌లో హ్యూమన్ జీపీఎస్ (Human GPS)గా పిలువబడే బాగూఖాన్‌ (Bagu Khan)ను ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు కాల్చిచంపాయి.


సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్‌లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు. నౌషెరా నార్ ఏరియాలో మరో ఉగ్రవాదితో కలిసి చొరబాటు ప్రయత్నం చేస్తుండగా భద్రతా దళాలు శనివారంనాడు కాల్చిచంపాయి.


సెక్యూరీటి గ్రిడ్ వర్గాల సమాచారం ప్రకారం, గురెజ్‌ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా చొరబాట్లకు బాగూఖాన్ సూత్రధారిగా వ్యవహరించాడు. ఆ ప్రాంతంలోని రహస్య మార్గాలు అణువణువునా తెలిసి ఉండటంతో చొరబాటు యత్నాలన్నీ దాదాపు విజయవంతమయ్యాయి. బాగూఖాన్ హిజ్బుల్ కమాండర్‌గా ఉన్నప్పుడు గురెజ్ సెక్టార్ నుంచి నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ఉగ్ర సంస్థలకు సహకరించేవాడు. ఏళ్ల తరబడి భద్రతా బలగాల కళ్లుకప్పి తిరుగుతున్న బాగూఖాన్ అదృష్టం తాజా చొరబాటు యత్నంలో తిరగబడంది. భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో అతని ఆటకట్టింది. దీంతో నౌషెరా ఏరియాలోని ఉగ్రసంస్థల లాజిస్టికల్ నెట్‌వర్క్‌కు గట్టిదెబ్బ తగిలింది.


ఇవి కూడా చదవండి..

శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

తీవ్ర విషాదం.. గుండె పోటుతో ఆస్పత్రిలోనే ప్రాణం విడిచిన గుండె డాక్టర్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 03:30 PM