Mata Vishno Devi Yatra: మాతా వైష్ణోదేవి యాత్ర తిరిగి సస్పెండ్
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:41 PM
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 19 రోజులుగా నిలిచిపోయింది.
శ్రీనగర్: మాతా వైష్ణోదేవి యాత్ర (Mata Vaishno Devi Yatra)కు ఆటంకాలు తప్పడం లేదు. భారీ వర్షాల (Heavy rains) కారణంగా యాత్రను తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు టెంపుల్ బోర్డు (Temple board) శనివారంనాడు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
'భవన్ ట్రాక్ వద్ద ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున 14వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వైష్ణోదేవి యాత్రను తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ వాయిదా వేస్తున్నాం' అని శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ బోర్డ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. భక్తులు అధికారిక సమాచారం కోసం వేచిచూడాలని కోరింది.
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 19 రోజులుగా నిలిచిపోయింది. అయితే వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు (SMVDB) ఇటీవల ప్రకటించింది. యాత్ర వివరాలు, బుకింగ్స్ కోసం www.maavaishnodevi.orgను చూడాలని కోరింది. అయితే ఇంతలోనే యాత్రా మార్గంలో తిరిగి భారీ వర్షాలు పడుతుండటంతో యాత్రను వాయిదా వేసినట్టు మరోసారి ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
మోదీ, హీరాబెన్‌పై ఏఐ వీడియో వివాదం.. కాంగ్రెస్‌పై ఎఫ్ఐఆర్
రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News