AI Video on PM Mother: మోదీ, హీరాబెన్‌పై ఏఐ వీడియో వివాదం.. కాంగ్రెస్‌పై ఎఫ్ఐఆర్..
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:12 PM
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్‌లోని దర్బంగాలో గత నెలలో కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ (Heeraben Modi)ను పరిహసిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కాంగ్రెస్ బిహార్ విభాగం చిక్కుల్లో పడింది. దీనిపై ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్(Congress) పార్టీపై శనివారం నాడు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో నార్త్ ఎవెన్యూ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్‌లోని దర్బంగాలో గత నెలలో కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318(2), 336(3)(4), 352, 356(2), 61(2) కింద కాంగ్రెస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
'సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది' (Maa appears in Sahab's dreams) అనే శీర్షికతో బిహార్ కాంగ్రెస్ 36 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలను గాయపరచేందుకు ఉద్దేశించిన వీడియోగా దీనిపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News