Man Rescues Calf Video: మనసుకు హత్తుకునే వీడియో.. ఆవు దూడను నడుముకు కట్టుకుని..
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:38 PM
ఓ వ్యక్తి లేగ దూడను నడుముకు కట్టుకుని ఉన్నాడు. తను, లేగ దూడ వర్షంలో తడవకుండా ఉండేలా ఓ ప్లాస్టిక్ కవర్‌ను అడ్డుగా పెట్టుకున్నాడు. ఆ లేగ దూడ ఎంతో ముద్దుగా కవర్ కింద నుంచి చుట్టూ చూస్తూ ఉంది.
జమ్మూకాశ్మీర్‌లో గత నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ప్రమాద ప్రదేశాల్లో పరిస్థితులు మనసును కలిచివేసేలా ఉంటున్నాయి. విషాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జమ్మూకాశ్మీర్‌నుంచి మనసును హత్తుకునే వీడియో ఒకటి బయటకు వచ్చింది. నరేందర్ సింగ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. కొండ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. ఓ వ్యక్తి లేగ దూడను నడుముకు కట్టుకుని ఉన్నాడు. తను, లేగ దూడ వర్షంలో తడవకుండా ఉండేలా ఓ ప్లాస్టిక్ కవర్‌ను అడ్డుగా పెట్టుకున్నాడు. ఆ లేగ దూడ ఎంతో ముద్దుగా కవర్ కింద నుంచి చుట్టూ చూస్తూ ఉంది. ఆ వ్యక్తి లేగ దూడను కట్టుకునే అటు, ఇటు తిరుగుతూ ఉన్నాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోపై 2,700లకుపైగా మంది స్పందించారు.
‘నన్ను నమ్మండి.. నిజంగా అతడు ఓ ఆణిముత్యం’..‘అన్న మనసు గెలుచుకున్నాడు’..‘నిజమైన జంతు ప్రేమికుడు’..‘క్యూట్‌నెస్ 100 శాతం.. మానవత్వం 1000 శాతం’..‘క్రిష్ 4’.. ‘ఈ ఒక్క కారణంతోనే నేను ఇంటర్‌నెట్‌కు డబ్బులు కడుతున్నాను’..‘ఈరోజు నేను చూసిన మంచి విషయం ఇదే’..‘కోయి మిల్‌గయా సినిమాలో జాదూ గుర్తుకు వచ్చాడు. అతడు మంచి పని చేస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో ప్రధానీ మోదీ ఫోన్ కాల్..
అత్యంత అరుదైన సంఘటన.. 26 ఏళ్లుగా వ్యక్తి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్