PM Modi Talks To Ukraines Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో ప్రధానీ మోదీ ఫోన్ కాల్..
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:10 PM
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్‌స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
గత కొన్నేళ్ల నుంచి రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల్లో ప్రతీరోజూ ఎక్కడో చోట మిస్సైల్స్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాలు చాలా నష్టపోయాయి. అయినా కూడా యుద్ధం ఆగటం లేదు. రష్యా యుద్ధం ఆపడానికి ఒప్పుకోవటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు కూడా జరిపారు.
పుతిన్ సానుకూలంగా స్పందించలేదు. ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ ఈ విషయంలో కలుగజేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో ఉన్నారు. రేపు (ఆదివారం) చైనాలోని టియాన్‌జిన్ పట్టణంలో జరిగే షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో పాల్గొంటారు. ఈ సమిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొంటారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జెలన్‌స్కీకి ఫోన్ చేశారు.
యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తాం..
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్‌స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రష్యాతో యుద్ధం ఆపడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో మాట్లాడటం సంతోషంగా ఉంది. తాజా పరిణామాలపై ఆయన అభిప్రాయాలను విన్నాను. శాంతియుతంగా యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడానికి సహకరిస్తామని చెప్పాం. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాం’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మార్స్ మీద ఏమిటది? సైంటిస్టులకు సవాల్ విసురుతున్న అంగారక గ్రహం..
అత్యంత అరుదైన సంఘటన.. 26 ఏళ్లుగా వ్యక్తి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్