Mars rock discovery: మార్స్ మీద ఏమిటది? సైంటిస్టులకు సవాల్ విసురుతున్న అంగారక గ్రహం..
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:06 PM
ఖగోళ శాస్త్రజ్ఞులను అంగారక గ్రహం ఎప్పుడూ ఊరిస్తునే ఉంటుంది. ఎంతో ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. మిగిలిన గ్రహాలతో పోల్చుకుంటే భూమికి కాస్త సారూపత్య కలిగిన గ్రహం మార్స్ మాత్రమే. దీంతో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు మార్స్‌పై పరిశోధనలు చేస్తున్నాయి.
ఖగోళ శాస్త్రజ్ఞులను అంగారక (Mars) గ్రహం ఎప్పుడూ ఊరిస్తునే ఉంటుంది. ఎంతో ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. మిగిలిన గ్రహాలతో పోల్చుకుంటే భూమికి కాస్త సారూపత్య కలిగిన గ్రహం మార్స్ మాత్రమే. దీంతో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు మార్స్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని విషయాలు మాత్రం మిస్టరీలుగానే ఉన్నాయి. మనుషులు జీవించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అంచనాలతో శాస్త్రవేత్తలు మార్స్ గుట్టు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు (Mars rock discovery).
నాసా ఇప్పటివరకు చేపట్టిన మార్స్ మిషన్స్‌లో ప్రజలు షాక్ అయ్యే విషయాలు, ఫొటోలు చాలానే బయటకు వచ్చాయి. వీటిలో చాలా ఆకారాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. నాసాకు (NASA) చెందిన పెర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) తాజాగా ఓ వింత ఆకారానికి సంబంధించిన ఫోటో తీసింది. అది చూడడానికి ఓ హెల్మెట్ ఆకారంలో ఉంది (helmet-like rock). రోవర్ మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ద్వారా 5 ఆగస్టు 2025న ఈ ఫొటో తీశారు. చూడడానికి టోపీలా ఉన్న ఈ ఆకారం అగ్నిపర్వత విస్పోటనం, రసాయన వాతావరణం, ఖనిజాల అవపాతం ద్వారా ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు (NASA Mars finding).
గతంలో పెర్సెవరెన్స్ అంగారక గ్రహంపై కొన్ని వింత రాళ్లకు సంబంధించిన ఫొటోలను తీసింది. ఆ రాళ్లు డోనట్ ఆకారంలో, అవకాడో తరహాలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రస్తుతం అంగారక గ్రహంపై దొరికిన ఈ హెల్మెట్ ఆకారంలో ఉన్న శిలను అధ్యయనం చేస్తున్నారు. ఈ శిలపై అధ్యయనం చేయడం ద్వారా వందల ఏళ్ల నాటి దాని పరిసరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆకృతులు, శిలజాలు అంగరాకం గ్రహం చరిత్రను సమగ్రంగా తెలుపుతాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి
సుంకాలు అమల్లోనే ఉన్నాయి.. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి