Share News

PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:41 PM

చైనాలో ప్రధాని పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2018లో ఆయన చైనాలో పర్యటించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.

PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి
Narendra Modi

బీజింగ్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ శిఖరాఖ సదస్సు (SCO Summit)లో పాల్గొనేందుకు ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు. చైనాలో ప్రధాని పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2018లో ఆయన చైనాలో పర్యటించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల బాదుడుతో విరుచుకుపడుతున్న క్రమంలో మోదీ పర్యటన ప్రత్యేకత సంతరించుకుంది.


చైనాలో అడుగుపెట్టిన ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆదివారంనాడు షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. మధ్యాహ్నం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు.


కాగా, మోదీ చైనా పర్యటన ఇరుదేశాల సంబంధాలలో స్పష్టమైన మలుపు అని చైనా మీడియా, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లను వ్యతిరేకిస్తున్న మోదీ వైఖరిని ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

సుంకాలు అమల్లోనే ఉన్నాయి.. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

అవసరమైతే అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 05:55 PM