Home » Jammu and Kashmir
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని, నగ్రోటాతో పాటు బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని గెలుపు అనంతరం దేవయాని రాణా వ్యాఖ్యానించారు.
ఢిల్లీ పేలుడు ఘటనను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అయితే, కశ్మీరీలు అందరినీ అనుమానితులుగా చూడొద్దని అన్నారు.
బారాముళ్లా నుంచి బనిహాల్ వెళుతున్న రైలును గద్ద ఢీకొంది. దీంతో లోకో పైలట్కు గాయాలు అయ్యాయి. అనంత్నాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి.
జమ్మూకశ్మీర్ కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులపై దాడి చేశారు.
జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్బల్, బడ్గాం నియోజవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం గందేర్బల్ నియోజకవర్గాన్ని తనవద్దే ఉంచుకుని బడ్గాంను వదులుకున్నారు.
జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్షా చెప్పారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.