Encounter: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:22 PM
జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.
జమ్ము కాశ్మీర్: కథువా జిల్లా(Kathua)లో ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాదులు కథువా జిల్లా బిల్లావర్ (Billawar) ప్రాంతంలో సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, సీఆర్పీపీఎఫ్ (CRPF), జమ్మూ కశ్మీర్ పోలీస్ ప్రత్యేక బృందం(SOG) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం నజోట్(Najote) అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ అటవీ ప్రాంతంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా జైష్-ఎ-మహమ్మద్ సంస్థకు చెందిన కమాండర్ ఉన్నట్లు సమాచారం. అయితే.. దీనిపై భద్రతా బలగాలు ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఎవరికీ గాయాలు, ప్రాణ హాని జరగలేదని భద్రతా దళాలు వెల్లడించాయి. గత వారం కూడా.. కహోగ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఘటన జరిగింది. చీకట్లో ఉగ్రవాదులు కొండప్రాంతాలను ఆసరాగా చేసుకుని తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి