Home » Jagtial
జిల్లాలో చిట్‌ఫండ్స్ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీరో చిట్స్ దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన చిట్ రిజిస్ట్రార్ శాఖ పట్టించుకోకపోవడంతో చిట్ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శేలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మద్యతరగతికి చెందినవారు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి చిట్స్ వేస్తుంటారు.
జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన భక్తులు వినాయక నిమజ్జన వేడుకలను రెండో రోజు శనివారం ఘనంగా జరుపుకున్నారు.
జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువులకు జల కళ సంతరించుకుంది. ఆగస్టులో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైన విషయం విదితమే. జిల్లా వార్షిక వర్షపాతం ఆగస్టు వరకు 238.7 మిల్లీమీటర్లు కాగా 319.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరగనున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల జాతర-2025 కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా పల్లెల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బోధనేతర పనులతో సమయం గడిచిపోతోంది. ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ఉపాధ్యాయులు నేడు యాప్, ఆన్‌లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరవుతున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తూ మున్సిపాలిటీల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కా పద్దులు, బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యతలు చూసే ఆర్‌పీ (రిసోర్స్ పర్సన్)లకు వేతన వెతలు తప్పడం లేదు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శాతవాహన యూనివర్సిటీలో అవినీతి బాగోతం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులే సూత్రధారులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. యూనివర్సిటీ పరిపాలన విభాగం నిర్వహించే భవనం మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
పట్టణ మహిళా పేదరిక నిర్మూలనకు పాటు పడాల్సిన మెప్మా సిబ్బంది అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అందిన కాడికి మేస్తున్నారు. వారి అక్రమాలకు రాజకీయ పలుకుబడి కూడా అనుకూలించడంతో వారి అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్ వ్యూహం రూపొందిస్తున్నది.