Home » Israel
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలి షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్‌లో షాద్మానీ తలదాచుకున్నట్టు కచ్చితమైన సమాచారంలో దాడులు జరిరినట్టు ఐడీఎఫ్ తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు (Iran Israel Conflict) తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ దాడులు న్యూక్లియర్ సదుపాయాలు, సైనిక కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులపై జరిగాయి. దీంతో అక్కడి రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించి పోయాయి.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు మంగళవారంతో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉద్ధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్‌లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు.
ఇరాన్ వందలాది మిసైల్‌లతో ఇజ్రాయెల్‌ను (Iran Israel War) లక్ష్యంగా చేసుకోగా, ఇజ్రాయెల్ ప్రతి దాడులు వందల మరణాలకు కారణమయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Israel bombs Iran TV studio: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ బాంబు దాడికి లైవ్‌లో వార్తలు చదువుతున్న యాంకర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేసుకుంటోంది. ‘‘మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను వదిలి వెళ్లండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి..
ఇరాన్ ఆదివారంనాడు జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవివ్ లోని అమెరికా రాయబార కార్యాలయం భవంతి దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేశారు
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మెహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుదాడి జరిపితే పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పారు.