Share News

ఫోర్డో అణు కేంద్రమే లక్ష్యంగా

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:02 AM

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా టెల్‌అవీవ్‌ అక్కడి అణు స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఫోర్డో అణు కేంద్రమే లక్ష్యంగా

శక్తిమంతమైన బంకర్‌ బస్టర్‌ బాంబును

ఇజ్రాయెల్‌కు అమెరికా ఇవ్వనున్నట్టు ప్రచారం

బ్యాంకాక్‌, జూన్‌ 17: ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా టెల్‌అవీవ్‌ అక్కడి అణు స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇరాన్‌లో కొండ కింద భూగర్భంలో నిర్మించిన ఫోర్డో అణు కేంద్రాన్ని పేల్చేయడం ఇజ్రాయెల్‌కు సాధ్యం కావట్లేదు. దీంతో.. ఆ కేంద్రాన్ని నాశనం చేసే శక్తి ఉన్న జీబీయూ-57 ఏ/బీ బంకర్‌ బస్టర్‌ బాంబులను ట్రంప్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అందించనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. సాధారణ క్షిపణులు నేలపై పడగానే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. అయితే బంకర్‌ బస్టర్‌ బాంబులు మాత్రం నేలను తొలుచుకుంటూ లోపలకు వెళ్లి భూగర్భంలో పటిష్ఠంగా నిర్మించిన బంకర్లలోకి చొచ్చుకెళ్లిన తర్వాత పేలుతాయి. దీంతో అండర్‌గ్రౌండ్‌లో బంకర్‌లో దాక్కున్న వారంతా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు. కాగా.. యురేనియంను అధిక స్థాయిలో శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన ఫోర్డో అణు కేంద్రాన్ని బ్యాంకర్‌ బస్టర్‌ బాంబు ఢీ కొడితే భారీస్థాయిలో రేడియేషన్‌ విడుదలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

‘ఫోర్డో’ ఎందుకంత కీలకం

ఇరాన్‌ అణు కేంద్రాల్లో నంతాజ్‌ తర్వాత ఫోర్డోనే అత్యంత కీలకం. టెహ్రాన్‌కు 95 కిలోమీటర్ల దూరంలో కోమ్‌ నగరానికి సమీపంలోని ఒక పర్వతం కింద అత్యంత రహస్యంగా నిర్మితమైన ఈ కేంద్రం నతాంజ్‌ అణు శుద్ధి కేంద్రం కంటే చిన్నది. రాతి నేల కింద భూగర్భంలో 260 అడుగుల లోతున దీని నిర్మాణం 2006లో ప్రారంభమైందని చెబుతారు. 2023లో ఈ కేంద్రంలో 83.7 శాతం శుద్ధి చేసిన యురేనియంను ఐఏఈఏ గుర్తించింది. ఇక్కడ 2,700 సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయని పేర్కొంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా చేరువలో ఉండటం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలోనే.. ఇరాన్‌ అణ కార్యక్రమాన్ని నామరూపాల్లేకుండా చేయాలంటే ఫోర్డో కేంద్రాన్ని పూర్తిగా ధ్వసం చేయడమే మార్గమని అమెరికా, ఇజ్రాయెల్‌ భావిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌ ముందున్న ప్రత్యామ్నాయాలివీ..

బంకర్‌ బస్టర్‌ బాంబులు ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తే ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్‌ ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఫోర్డో చుట్టూ ఉన్న విద్యుత్తు ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలను ధ్వసం చేయడం ద్వారా ఈ అణుకేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. భూగర్భంలో ఉన్న ఈ కేంద్రం ప్రవేశ ద్వారాలపై దాడులు చేసి సిబ్బందిని లోపలే చిక్కుకుపోయేలా చేయవచ్చు. అందులోని పరికరాలను నిరుపయోగంగా మార్చవచ్చు. ఇజ్రాయెల్‌ కమాండోలు సాహసం చేసి లోపలకు చొరబడి బాంబులు అమర్చడం ద్వారా కేంద్రాన్ని నాశనం చేసే అవకాశం కూడా ఉంది.

ఫోర్డో’ ఎందుకంత కీలకం

Updated Date - Jun 18 , 2025 | 04:03 AM