Israel vs Iran: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య స్నేహం గురించి తెలుసా? ఈ రెండు దేశాల వైరానికి కారణం ఏంటి..?
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:00 PM
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది.

ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడుల (Missile attacks)కు పాల్పడుతోంది. ప్రస్తుతం బద్ధ శత్రువులుగా యుద్ధానికి కాలు దువ్వుతున్న ఈ రెండు దేశాలు ఒకప్పుడు చాలా స్నేహపూర్వకంగా మెలిగేవి. ఇజ్రాయెల్ ఓ దేశంగా ఏర్పడినపుడు దానిని గుర్తించడానికి ఇతర దేశాలు నిరాకరించిన సమయంలో టర్కీతో పాటు ఇరాన్ మద్దతుగా నిలిచాయి.
1948లో ఓ దేశంగా ఏర్పడినపుడు, పశ్చిమాసియాలోని ముస్లిం మెజారిటీ దేశాలు కొత్త దేశమైన ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి నిరాకరించాయి. ముస్లింలలో ఒక తెగ అయిన షియాలు మెజారిటీగా కలిగిన ఇరాన్, టర్కీ మాత్రమే ఇజ్రాయెల్‌ను ఓ దేశంగా గుర్తించాయి. ఈ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడానికి మరో కారణం అమెరికా.
ఆ సమయంలో షా మొహమ్మద్ రెజా పహ్లవి నాయకత్వంలోని ఇరాన్.. అమెరికాకు మిత్ర దేశంగా ఉండేది. పశ్చిమాసియాలో అమెరికాకు కీలక ప్రాంతీయ భాగస్వామిగా ఉండేది. దాంతో అమెరికా కోరిక మేరకు ఇజ్రాయెల్‌ను ఓ దేశంగా గుర్తించి పలు సహకారాలు అందించేది. ఇరాన్‌తో పాటు టర్కీ, ఇథియోపియా కూడా ఇజ్రాయెల్‌తో స్నేహపూర్వకంగా మెలిగేవి.
1979లో తలెత్తిన ఇస్లామిక్ విప్లవం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలను దూరం చేసింది. ఇరాన్‌లో షాను పడగొట్టిన ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ.. ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపన చేయడంతో పరిస్థితి మరింత మారిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్‌లను అంగీకరించడానికి ఇరాన్ నిరాకరించింది. ఇరాన్ పౌరులు ఇజ్రాయెల్‌లోని ఆక్రమిత పాలస్తీనాకు వెళ్లకూడదని నిషేధం విధించింది.
ఇక, ఆ తర్వాత 1980, 90ల్లో ఇజ్రాయెల్‌లో హింసకు పాల్పడే సాయుధ గ్రూపులకు స్పాన్సర్‌గా కూడా ఇరాన్ నిలిచింది. ఇజ్రాయెల్‌పై దాడులు చేసే గ్రూపులు అయిన హిజ్బుల్లాలు, గౌతీలు, హమాస్ సంస్థలకు ఆయుధాలు సమకూర్చే పనిని ఇరాన్ ప్రారంభించింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య శత్రుత్వం మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి..
కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్ నేతన్యాహూ మధ్య వీటో వివాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి