Share News

IDF: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:14 PM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలి షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్‌లో షాద్మానీ తలదాచుకున్నట్టు కచ్చితమైన సమాచారంలో దాడులు జరిరినట్టు ఐడీఎఫ్ తెలిపింది.

IDF: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

జెరూసలేం: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. టెహ్రాన్‌పై టెల్ అవీవ్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ అలి షాద్మాని మృతి చెందినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మంగళవారంనాడు ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలి షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్‌లో షాద్మానీ తలదాచుకున్నట్టు కచ్చితమైన సమాచారంతో దాడులు జరిపినట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు ఆయన నేతృత్వం వహిస్తున్నారని వెల్లడించింది. అయితే, అలీ షాద్మానీ మృతి వార్తను ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించ లేదు.


ఇజ్రాయెల్‌కు ఆ హక్కు ఉంది

దీనికి ముందు, జీ-7 సదస్సులో ప్రపంచ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మధ్యప్రాశ్చంలో శాంతి, సుస్ధిరతకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని ఆ ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, పౌరుల రక్షణ చాలా కీలకమని తెలిపింది.


మధ్యప్రాశ్చంలో అస్థిరత, టెర్రర్‌కు ఇరాన్ ప్రధాన కారణమవుతోందని జీ-7 దేశాలు ఆరోపించాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని తాము పదేపదే చెబుతున్నామని, ఇరాన్ దాడులను విరమించుకోవాలని కోరాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప్రభావం పడనుందని, అంతా అప్రమత్తంగా ఉండాలని జీ-7 దేశాలు సూచించాయి.


ఇవి కూడా చదవండి..

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్‌ నేతన్యాహూ మధ్య వీటో వివాదం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 02:23 PM