Share News

Iran Israel Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ.. స్తంభించిన రవాణా, జనాల తంటాలు..

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:48 PM

ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు (Iran Israel Conflict) తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ దాడులు న్యూక్లియర్ సదుపాయాలు, సైనిక కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులపై జరిగాయి. దీంతో అక్కడి రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించి పోయాయి.

Iran Israel Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ.. స్తంభించిన రవాణా, జనాల తంటాలు..
Iran Israel Conflict

ఇరాన్‌లో దాడుల వేళ పరిస్థితులు (Iran Israel Conflict) అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి జనాల జీవనం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ కోమ్ ప్రాంతంలోని 55 ఏళ్ల అఫ్గాన్ వ్యాపారవేత్త హుస్సేన్ తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇరాన్ గగనతలం పూర్తిగా క్లోజ్ చేశారు. విమానాలు, మార్కెట్లు, అన్నీ మూతపడ్డాయి. ఈ క్రమంలో ట్యాక్సీ కూడా దొరకడం కష్టంగా మారిందని వాపోయాడు. ఘర్షణ తీవ్రమవుతుండటంతో ఏ డ్రైవర్ కూడా అతన్ని సరిహద్దు వరకు తీసుకెళ్లలేదు. దీంతో ఆదివారం (జూన్ 15) దాడుల తర్వాత అతను టెహ్రాన్ పారిపోయాడు. ప్రస్తుతం అతను ఒక చిన్న హోటల్ బేస్‌మెంట్‌లో బతుకుతున్నానని ఓ మీడియాకు చెప్పాడు.


ఇరాన్‌లో భయాందోళన

ఇజ్రాయెల్ శుక్రవారం (జూన్ 13) ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో సీనియర్ సైనిక అధికారులు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంస మయ్యాయి. లకోమ్ నుంచి 18 మైళ్ల దూరంలో ఉన్న న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్ సౌకర్యం కూడా లక్ష్యంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు.


గగనతలం మూసివేత

ఈ సంఘర్షణ కారణంగా (Iran Israel Conflict) మధ్య ప్రాచ్యంలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. డజన్ల కొద్ది విమానాశ్రాయాలు విమాన సర్వీసులను తీవ్రంగా తగ్గించాయి. దీంతో వేలాది మంది ప్రయాణీకులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో 50,000 మంది ప్రయాణీకులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మరి కొందరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని చూసినా కూడా సాధ్యం కావడం లేదు. దేశంలోని మూడు విమానయాన సంస్థల జెట్‌లు సైప్రస్‌లోని లార్నాకాకు తరలించబడ్డాయి.


ల్యాండింగ్ సమయంలో

50 ఏళ్ల జివికా బెర్గ్ న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్ సమయంలో పైలట్ నుంచి ఊహించని సందేశం వచ్చింది. క్షమించండి, మనం లార్నకాకు మళ్లించబడ్డామని పేర్కొన్నారు. బెర్గ్, బర్లిన్ నుంచి వచ్చిన మరో ఇజ్రాయెల్ విమానాన్ని సైప్రస్‌లోని లార్నకా విమానాశ్రాయంలో లాండ్ చేశారు. ఇప్పుడు అతను లార్నకాలోని ఒక హోటల్‌లో ఉంటూ జీవిస్తున్నారు. ఇరాన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులలో అర్సలాన్ అహ్మద్ ఒకరు. మెడికల్ విద్యార్థులతో సహా ఇతర విద్యార్థులు తమ హాస్టళ్లను విడిచి బయటకు రావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్.. తొలిసారిగా మూడో సూపర్ ఓవర్‌లో విజయం..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 01:58 PM