Home » Israel
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడం పరిస్థితులను ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగిస్తోంది. అమెరికాతో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారంనాడు చేపట్టిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిటలరీ ఆపరేషన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా శనివారం ఉదయం టెహ్రాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసంపై కూడా ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి.
ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు జరుపుతుండటంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌కు పలు దేశాలు తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఇరాన్ పట్టించుకోలేదు.
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో అయతొల్లా ఖమేనీ టెహ్రాన్‌లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ ఒకరు మృతిచెందారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా సహా మొత్తం ఎనిమిది దేశాలే లక్ష్యంగా మిసైల్ దాడులు నిర్వహిస్తోంది.
తమపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంప్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకు రావడంతో ఇజ్రాయెల్‌లోని 'హోమ్ ఫ్రంట్ కమాండ్' యాప్ ఎరుపు (డేంజర్) రంగులోకి మారిపోయింది.