దుబాయ్‌లో హై టెన్షన్.. బుర్జ్ ఖలీఫా ఖాళీ..
ABN , Publish Date - Feb 28 , 2026 | 09:08 PM
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగిస్తోంది. అమెరికాతో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దుబాయ్‌లో కూడా బాంబుల శబ్దాలు వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి (Burj Khalifa evacuation news).
ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఈ భవనంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. శనివారం దుబాయ్, అబుదాబిలో భారీ శబ్దాలు వినిపించాయి. అయితే యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. అబుదాబిలో కూలిన క్షిపణి శకలాల వల్ల ఒకరు మరణించారు (Dubai explosion reports).
ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయంగా విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది (Israel Iran war update). చాలా ఆసియా దేశాల నుంచి అమెరికా, యూరప్ వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా దుబాయ్ నుంచే ప్రయాణం చేస్తుంటారు. తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ లీడర్ ఖమేనీ నివాసంపై దాడి.. తొలి ఫొటో ఇదే..
ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 40 మంది బాలికల మృతి..