Share News

ఇరాన్ లీడర్ ఖమేనీ నివాసంపై దాడి.. తొలి ఫొటో ఇదే..

ABN , Publish Date - Feb 28 , 2026 | 06:34 PM

ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా శనివారం ఉదయం టెహ్రాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసంపై కూడా ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి.

ఇరాన్ లీడర్ ఖమేనీ నివాసంపై దాడి.. తొలి ఫొటో ఇదే..
Khamenei compound attack

ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా శనివారం ఉదయం టెహ్రాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. అయితే ఖమేనీ అంతకు ముందే సురక్షితంగా తప్పించుకున్నట్టు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ లక్ష్యంగానే దాడులకు పాల్పడినట్టు ఇజ్రెయెల్ వెల్లడించింది (Khamenei compound attack).


టెహ్రాన్‌లోని ఖమేనీ ఇంటి దగ్గర జరిగిన భారీ నష్టాన్ని తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. ఖమేనీ, మసౌద్ పెజెష్కియన్ ఈ దాడుల నుంచి క్షేమంగా బయటపడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్‌కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు, పాలనా విభాగంలోని అత్యున్నత హోదాల్లో ఉన్న అధికారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమచారం. అలాగే ఇజ్రాయెల్ దాడుల కారణంగా మినాబ్‌లోని ఓ బాలికల పాఠశాల తీవ్రంగా ధ్వంసమైంది. కనీసం 40 మంది బాలికలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో పిల్లలు తీవ్ర గాయాల పాలైనట్టు సమాచారం (US Israel airstrike Iran).


అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యాయి. ఆ దాడులకు ప్రతిగా ఇరాన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది (Middle East conflict 2026). ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించింది. అలాగే పలు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

Updated Date - Feb 28 , 2026 | 06:34 PM