Share News

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 40 మంది బాలికల మృతి..

ABN , Publish Date - Feb 28 , 2026 | 06:22 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఇరాన్ పట్టించుకోలేదు.

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 40 మంది బాలికల మృతి..
Minab school strike

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం ఇజ్రాయెల్ భూ భాగం నుంచి అమెరికా దాడులు ప్రారంభించింది. ఈ దాడుల నేపథ్యంలో జరిగిన ప్రాణనష్టంపై తొలి నివేదిక తాజాగా బయటకు వచ్చింది (Minab school strike).


మినాబ్‌లో ఇరాన్ పారా మిలటరీ రివల్యూషనరీ గార్డ్ స్థావరం ఉండటంతో దానిపై దాడులు జరిగాయి. అయితే ఆ ప్రాంతానికి సమీపంలో ఓ బాలికల పాఠశాల కూడా ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ఈ పాఠశాల తీవ్రంగా ధ్వంసమైంది. కనీసం 40 మంది బాలికలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో పిల్లలు తీవ్ర గాయాల పాలైనట్టు సమాచారం. ఈ దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మీ విధిని మీరే లిఖించుకోవాలని, 1979 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఇస్లామిక్ నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చారు (Israeli US attack Iran).


శనివారం ఉదయం టెహ్రాన్‌పై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది (Middle East conflict 2026). ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించింది. అలాగే పలు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

Updated Date - Feb 28 , 2026 | 06:27 PM