Share News

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే మృతి

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:05 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారంనాడు చేపట్టిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిటలరీ ఆపరేషన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే మృతి
Amir Nasirzadeh

టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారంనాడు చేపట్టిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే (Amir Nasirzadeh) మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిటలరీ ఆపరేషన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమీర్ నాసిర్జాదే 2024 ఆగస్టు నుంచి ఇరాన్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇరానియన్ సాయుధ దళాల డిప్యూటీ ఆఫ్ స్టాఫ్‌గా, ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా సేవలందించారు. ఇదే దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమామండర్ మహమ్మద్ పాక్పైర్ కూడా మరణించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఇరాన్ మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.


ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా టెహ్రాన్‌పై దాడులకు దిగాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. అయితే ఖమేనీ అంతకు ముందే సురక్షితంగా తప్పించుకున్నట్టు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్టు కథనాలు వెలువడుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ లీడర్ ఖమేనీ నివాసంపై దాడి.. తొలి ఫొటో ఇదే..

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 40 మంది బాలికల మృతి..

Updated Date - Feb 28 , 2026 | 08:25 PM