Share News

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల తప్పదా..?

ABN , Publish Date - Feb 28 , 2026 | 07:06 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడం పరిస్థితులను ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల తప్పదా..?
India precious metals news

పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడం పరిస్థితులను ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం నేరుగా కమోడిటీ మార్కెట్‌పై పడనుంది. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు (India gold price surge).


ఇప్పటికే యుద్ధ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,68,710కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే పది గ్రాములకు ఏకంగా రూ.7,140 మేర పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,360కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే పది గ్రాములకు ఏకంగా రూ.6,530 మేర పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు పది వేల రూపాయల మేర పెరిగి ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది (silver rate India rises).


మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. మార్చి తొలి వారానికి బంగారం ప్రస్తుత ధరతో పోల్చుకుంటే 15 శాతం మేర పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దాదాపు రూ.23 వేల నుంచి 25 వేల వరకు పెరగొచ్చు. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలో 10 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర తిరిగి రూ.2 లక్షలకు చేరువ అవుతుందని భావిస్తున్నారు (US Iran conflict bullion).


బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి (India precious metals news). నిపుణుల అంచనా ప్రకారం.. కిలో వెండి స్వల్ప కాలంలో ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.30 నుంచి 50 వేల వరకు పెరగొచ్చు. యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ధరల పెరుగుదల అంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వెండి తిరిగి తన చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిలను దాటి రూ.4.2 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Updated Date - Feb 28 , 2026 | 09:11 PM