Share News

ఇరాన్ ప్రతీకార దాడులు.. పలు గల్ఫ్ దేశాల్లో బాంబు పేలుళ్లు..

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:01 PM

తమపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంప్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకు రావడంతో ఇజ్రాయెల్‌లోని 'హోమ్ ఫ్రంట్ కమాండ్' యాప్ ఎరుపు (డేంజర్) రంగులోకి మారిపోయింది.

ఇరాన్ ప్రతీకార దాడులు.. పలు గల్ఫ్ దేశాల్లో బాంబు పేలుళ్లు..
Iran missile retaliation

తమపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంప్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకు రావడంతో ఇజ్రాయెల్‌లోని 'హోమ్ ఫ్రంట్ కమాండ్' యాప్ ఎరుపు (డేంజర్) రంగులోకి మారిపోయింది. 'హోమ్ ఫ్రంట్ కమాండ్' యాప్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ హెచ్చరికలు, అత్యవసర మార్గదర్శకాలను చూపిస్తుంటుంది. ఇజ్రాయెల్ వైపు క్షిపణులు దూసుకొస్తుండడంతో, వాటిని గుర్తించిన యాప్ రెడ్ కలర్‌లోకి మారిపోయింది (Iran missile retaliation).


ఇరాన్ నుంచి క్షిపణులు వస్తుండడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లను మోగించారు. క్షిపణులను అడ్డుకుని, తిరిగి దాడి చేయడానికి ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌పైనే కాదు, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. తమ దేశంలోని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్‌పై దాడి జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది. అలాగే కువైట్, యూఏఈ, ఖతర్‌లలో కూడా పేలుళ్లు వినిపించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యూఏఈ, ఖతర్ తదితర దేశాలు ఇప్పటికే తమ గగనతలాన్ని మూసివేశాయి (Israel US attack Iran).


కొన్ని గంటల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా కలిసి దాడులు చేసిన సంగతి తెలిసిందే (Middle East conflict). ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. అయితే ఖమేనీ ఆచూకీ మాత్రం బయటపడలేదు. ఆయన ఇప్పటికే టెహ్రాన్ విడిచి వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగానే ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

Updated Date - Feb 28 , 2026 | 04:16 PM