Home » Iran War
అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
అమెరికా, ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. టెల్ అవీవ్‌లోని పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెబుతామని ఆయన అమెరికాను హెచ్చరించారు.
అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) తాము గౌరవిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే మాత్రం తగిన విధంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు.
హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని, రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు జరుగుతాయని చెప్పారు.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా హాజరుకానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?
పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.
పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.