Share News

హోర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల పేలుడు.. ఇరాన్ వాదనను ఖండించిన అమెరికా..

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:02 PM

హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఆ ప్రకటనను ఖండించింది.

హోర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల పేలుడు.. ఇరాన్ వాదనను ఖండించిన అమెరికా..
Strait of Hormuz

హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆ ప్రకటనను ఖండించింది. ఇరాన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది (Hormuz oil tanker explosion).


'కొద్దిసేపటి క్రితం హోర్ముజ్‌లో మందుపాతరలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయి. అలాగే ఈ జలమార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన నాలుగు నౌకలను అడ్డుకున్నాం' అని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఐఆర్‌జీసీ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. హోర్ముజ్ జలసంధిలో రెండు ట్యాంకర్లు పేలిపోయాయన్న సమాచారం వాస్తవం కాదని, వాణిజ్య నౌకలు యథావిధిగా ప్రయాణిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారం ద్వారా భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.


కాగా, మరోవైపు ఏడో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా దాడులను కొనసాగించింది (US Iran conflict). అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తోంది. ఇదే తరహాలో దాడులు మరో రెండు, మూడు రోజులు కొనసాగితే తాము పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. 'మేం దీటుగా స్పందిస్తాం. ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు' అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..

Updated Date - Jul 18 , 2026 | 12:28 PM