రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 07:23 AM
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్‌కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్‌కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగే మూడో మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డే అవుతుందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి (Rohit Sharma retirement).
సెలక్షన్ కమిటీ అంతర్గత చర్చలు వరుసగా లీక్ అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్టర్లు ఎలాంటి అంతర్గత సమాచారం లేదా ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి (BCCI selectors).
2027 వన్డే ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఇంగ్లండ్ సిరీస్ అనంతరం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం వెలువడింది. ఇటీవలి కాలంలో వన్డేల్లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో అతడి ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. దీంతో రోహిత్‌ను తప్పించి యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనే నిర్ణయానికి సెలక్టర్లు వచ్చినట్టు సమాచారం (Rohit Sharma last ODI).
కాగా, రోహిత్ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ అన్ని ఊహాగానాలను ఖండించారు. 'రోహిత్ శర్మ భారత్‌కు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తాడు. లార్డ్స్ మ్యాచ్ ఆయన చివరి వన్డే కాదు' అని స్పష్టం చేశారు. దీంతో రిటైర్మెంట్ వార్తలకు తాత్కాలికంగా తెరపడింది. ఏదేమైనా, రోహిత్ భవిష్యత్తుపై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు