ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు.. మూడో పెళ్లిపై వివాదం మరింత ముదురుతోందా..
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:48 AM
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమిర్‌కు సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమిర్‌కు సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ బెదిరింపు సందేశంలో ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పోస్టులు, ఆడియోల ప్రామాణికతను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు (Bishnoi gang threat to Aamir).
అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేర్లతో విడుదలైన ఆ సోషల్ మీడియా పోస్టు, ఆడియోలో ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని లవ్ జిహాద్‌గా అభివర్ణిస్తూ, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఆమిర్ తన చర్యలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంతో కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు విమర్శలు గుప్పించాయి. మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కూడా ఈ వివాహంపై వ్యాఖ్యలు చేస్తూ.. 'లవ్ జిహాద్' అంశాన్ని ప్రస్తావించారు (Aamir Khan third marriage).
ఈ వివాదాలపై ఇప్పటికే ఆమిర్ ఖాన్ స్పందించారు (Love Jihad controversy). తన వివాహాల్లో మత మార్పిడి జరగలేదని స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, అలాగే ప్రస్తుత భార్య గౌరీ స్ప్రాట్ ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని తెలిపారు. తమది అన్ని మతాలను గౌరవించే కుటుంబమని చెప్పారు. కాగా, తాజాగా ఆమిర్‌కు వచ్చిన ఈ బెదిరింపు వ్యవహారంపై అధికారిక పోలీసు ప్రకటన లేదా దర్యాప్తు వివరాలు వెలువడలేదు.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..