పాకిస్థాన్‌లో జగన్నాథ రథయాత్ర.. 'జై జగన్నాథ్' నినాదాలతో మారుమోగిన కరాచీ వీధులు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:18 AM
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూరీ నుంచి లండన్ వరకు చాలా చోట్ల వైభవంగా జగన్నాథుడి రథయాత్ర సాగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ అదే ఉత్సాహం కనిపించింది
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూరీ నుంచి లండన్ వరకు చాలా చోట్ల వైభవంగా జగన్నాథుడి రథయాత్ర సాగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ అదే ఉత్సాహం కనిపించింది. కరాచీ నగరంలోని చారిత్రక స్వామినారాయణ ఆలయం నుంచి జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు (Jagannath Rath Yatra).
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 'జై జగన్నాథ్', 'హరే రామ', 'హరే కృష్ణ' నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలు చాటారు. కరాచీలోని సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ స్వామినారాయణ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. పూలతో అందంగా అలంకరించిన రథంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు (Pakistan Hindus).
ఈ ఉత్సవాలను ప్రధానంగా కరాచీలో, అక్బర్ రోడ్‌లోని రత్తన్ తలావ్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ మందిరం, మారి మాతా ఆలయం చుట్టూ నిర్వహిస్తారు. ముగ్గురు దేవతలను అందంగా అలంకరించి, ఊరిగేంపు చేస్తుంటారు. అంతే కాకుండా భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ, ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ఊరేగింపులో పురుషులు, మహిళలు అందరూ పాల్గొంటారు. ఇస్కాన్ పాకిస్థాన్, పాకిస్థాన్ న్యూ వైకుంఠ ధామ్ భక్త సమాజ్ వంటి సమూహాలతో సహా హిందూ సమాజం ఈ పండుగను జరుపుతాయి (Viral Video Karachi Temple).
జగన్నాథుని రథయాత్ర ప్రతిధ్వనులు పాకిస్థాన్‌కే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న ఇస్కాన్ ఆలయం వద్ద కూడా రథయాత్ర జరిగింది. జపాన్, కెనడా, లండన్ వీధుల్లో కూడా జగన్నాథుని రథయాత్రలు జరిగాయి.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..