Share News

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..

ABN , Publish Date - Jul 18 , 2026 | 09:20 AM

ఒక వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఎప్పటిదో పాత బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. తన తాతకు చెందిన ఆ పాస్‌బుక్ 24 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఖాతాలో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉంది.

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..
Old bank account

ఒక వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఎప్పటిదో పాత బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. తన తాతకు చెందిన ఆ పాస్‌బుక్ 24 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఖాతాలో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఆ పాత పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పూజ అనే మహిళ.. 'ఆ డబ్బును తిరిగి పొందే వీలుందా' అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (SBI passbook).


ఈ నేపథ్యంలో పలువురు బ్యాంక్ నిపుణులు ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పారు. ముందుగా పాస్‌బుక్‌లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు. ఖాతా స్థితి, బ్యాలెన్స్, అవసరమైన పత్రాల వివరాలను అక్కడి అధికారులు తెలియజేస్తారని, అనంతరం బ్యాంకు నిబంధనల ప్రకారం క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు (Inactive bank account).


ఖాతాదారు మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రం, వారసుల గుర్తింపు, చిరునామా రుజువులు, నామినీ ఉంటే సంబంధిత వివరాలు, నామినీ లేకపోతే చట్టబద్ధ వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా సక్సెషన్ సర్టిఫికేట్ (బ్యాంకు అవసరాన్ని బట్టి) తీసుకెళ్లాలని, బ్యాంకు అందించే క్లెయిమ్ దరఖాస్తును నింపి సబ్మిట్ చేయాలని సూచించారు (Claim bank money). ఆ డబ్బు క్లెయిమ్ చేయని డిపాజిట్‌గా ఆర్‌బీఐకి చేరితే తప్ప, కొద్దిపాటి పత్రాలతోనే తిరిగి పొందవచ్చని చాలా మంది సూచించారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు.. సెలక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..

Updated Date - Jul 18 , 2026 | 09:59 AM