అప్రమత్తంగా ఉండండి.. అమెరికా పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరిక..
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:15 PM
పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులకు 'వరల్డ్‌వైడ్ కాషన్' పేరుతో భద్రతా హెచ్చరిక జారీ చేసింది.
పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ (US State Department) కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులకు 'వరల్డ్‌వైడ్ కాషన్' (Worldwide Caution) పేరుతో భద్రతా హెచ్చరిక జారీ చేసింది. అమెరికన్లు విదేశాల్లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది.
పశ్చిమాసియలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికా ప్రయోజనాలు, పౌరులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ముఖ్యంగా అమెరికా రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలను కచ్చితంగా పాటించాలని పౌరులకు సూచించింది (US worldwide security alert).
అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, జనసమ్మర్థ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వార్తలు, భద్రతా హెచ్చరికలను నిరంతరం గమనించాలని, సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ సూచనలను అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది (US travel advisory).
గత కొద్ది రోజులుగా ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేస్తోంది (Iran US conflict). ఇరాన్‌లోని పలు కేంద్రాలపై వైమానిక దాడులు చేస్తోంది. అందుకు ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిక జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..