Share News

శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండబోము: ఇరాన్

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:34 PM

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది.

శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండబోము: ఇరాన్
Iran on Peace MoU

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. అందులో పేర్కొన్న హామీలకు ఇకపై కట్టుబడి ఉండబోమని స్పష్టం చేసింది. శాంతి ఒప్పందాన్ని మొదట ఉల్లంఘించింది అమెరికాయేనని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించింది.

ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రభావశీలంగా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితమే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆ కథ ముగిసినట్టేనని అనుకుంటున్నాను. వాళ్లతో డీలింగ్ ఇక నా వల్ల కాదు. వాళ్లు చెత్త మనుషులు. వాళ్లతో వ్యవహారం అంటే సమయం వృథా చేసుకోవడమే’ అని ట్రంప్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు.


గత నెలలోనే ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు అవగాహన ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణతో పాటు హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న ఒప్పందం కుదిరింది. ఇరాన్ అణుకార్యక్రమంపై కూడా చర్చలు జరపాలన్న అవగాహన కుదిరింది. ఆ తరువాత హోర్ముజ్‌లో మూడు కమర్షియల్ నౌకలపై దాడులు జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.

కమర్షియల్ నౌకలను టార్గెట్ చేసిన ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఒప్పందంలో పేర్కొన్న హామీలకు కట్టుబడకుండా యూఎస్ తొలుత కట్టుతప్పిందని ఇరాన్ ఆరోపించింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలు పరస్పర దాడులను కొనసాగిస్తున్నాయి. గత వారం యూఎస్ వరుసగా రాత్రిళ్లు ఇరాన్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్‌లోని పలువురు అమెరికా మిలిటరీ స్థావరాలపై మిసైల్స్ ప్రయోగించింది. పలు యూఎస్ ఫైటర్లను ధ్వంసం చేశామని కూడా ప్రకటించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఈసారి రెండో హెచ్-1బీ లాటరీ లేదు: యూఎస్

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 18 , 2026 | 07:39 PM