Share News

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:22 PM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.


రగులుతున్న వైట్ హౌస్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన ఈ వివాదాస్పద హోర్డింగ్‌లో డోనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, అలాగే ఐదుగురు పిల్లలు ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, టిఫానీ, బారన్ ట్రంప్‌ల ఫొటోలు ఉన్నాయి. దీనిపై పర్షియన్ భాషలో 'రక్తానికి రక్తం' (Blood for Blood) అనే హెచ్చరిస్తూ రాశారు. ఇరాన్ బహిరంగంగా అమెరికా అధ్యక్షుడిని ఇలా బోర్డుల ద్వారా హెచ్చరించడం ఇది రెండోసారి. ఇంతకుముందు టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో ట్రంప్ శవపేటికలో పడుకున్నట్లు ఉన్న మరో హోర్డింగ్‌ను కూడా ప్రదర్శించారు. అందులో ట్రంప్ జుట్టు చెదిరిపోయి, నల్లటి శవపేటికలో ఉన్నట్లు చిత్రీకరించారు.


ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుబంధ సంస్థ అయిన 'ఔజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్' ఈ భారీ హోర్డింగులను డిజైన్ చేసింది. గత కొంతకాలంగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దళాలతో ఘర్షణలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేప్యంలో ఇరాన్ తన సైద్ధాంతిక, రాజకీయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టెహ్రాన్‌లోని ప్రధాన కూడళ్లను, రద్దీ ప్రాంతాలను ఇలాంటి యుద్ధ స్మారక ప్రచార వేదికలుగా వాడుకుంటోంది. ఈ తాజా పరిణామం పశ్చిమాసియాలో మరింత అలజడికి దారితీసేలా కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

Updated Date - Jul 18 , 2026 | 07:22 PM