Share News

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి..

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:33 PM

అహ్మదాబాద్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. రామోల్-గట్రాడ్ రోడ్డులోని కర్మాగారంలో ప్రమాదం జరిగి 8 మంది మృతిచెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి..
Firecracker Factory Blast

గుజరాత్: అహ్మదాబాద్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. రామోల్-గట్రాడ్ రోడ్డులోని కర్మాగారంలో ప్రమాదం జరిగి 8 మంది మృతిచెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో నలుగురిని ఎల్జీ ఆస్పత్రికి తరలించిన సహాయక సిబ్బంది.. మరో ముగ్గురిని అసర్వా సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


వస్త్రాల్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ శిబిరం వెనుకే ఆ ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం విన్న వెంటనే శిబిరంలోని సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక బృందాలు రాకముందే సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అనంతరం ఘటనాస్థలికి ఐదు అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు.


ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు బాణసంచా కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. ఈ పేలుడుతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వారు వెల్లడించారు. కాగా, పేలుడు ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళనలు రేకెత్తినట్లు పేర్కొన్నారు. పేలుడు ధాటికి శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని వారు వెల్లడించారు.

బాణసంచా కర్మాగారంలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అనుమానిత ఉగ్రవాదుల కేసులో ఏటీఎస్ సంచలన విషయాలు వెల్లడి..

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. సిరా లాంటి ద్రవం చల్లిన మహిళ..

Updated Date - Jul 18 , 2026 | 07:29 PM