Share News

నాకు ఇక పెళ్లి కాదేమో.. యువ సర్జన్ ఆవేదన

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:01 PM

డాక్టర్ చదువుల కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఒక యువ డాక్టర్ తనకు పెళ్లి కూడా కాదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

నాకు ఇక పెళ్లి కాదేమో.. యువ సర్జన్ ఆవేదన
Young Doctor burdened by Debt

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ చదువుల కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఒక యువ డాక్టర్ (28) తనకు పెళ్లి కూడా కాదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కుటుంబంలో తానే మొదటి వైద్యుడినని ఆయన చెప్పుకొచ్చారు. తండ్రి లోను తీసుకుని మరీ బలవంతంగా తనను ఎంబీబీఎస్ చదివించారని చెప్పారు.

అండర్‌గ్రాడ్యుయేట్ చదువులపై 6.5 సంవత్సరాల కాలం పోయిందని చెప్పారు. ఫీజు కట్టలేకపోవడంతో ఒక సంవత్సరం వృథా అయ్యిందని కూడా అన్నారు. ఆ తరువాత ఉద్యోగాలకు అప్లై చేస్తే కొన్ని ఆసుపత్రులు నెలకు రూ.30 వేల శాలరీనే ఆఫర్ చేశాయని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు రాకపోవడంతో మళ్లీ ప్రైవేటు కాలేజీలో చేరాల్సి వచ్చిందని, ఇందుకోసం మళ్లీ లోన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.


doc.jpg

ఇలా చదవుల కోసం దశాబ్దానికి పైగా కాలం కరిగిపోయి చివరకు అప్పుల భారం మిగిలిందని విచారం వ్యక్తం చేశారు. రూ.69 లక్షల ఎడ్యుకేషన్ లోన్, రూ.4-5 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు, బంధువులు, స్నేహితుల వద్ద చేసిన మరో రూ. 26 లక్షల అప్పు, కారు లోన్ ఈఎమ్ఐలు వంటివన్నీ భారంగా మారాయని చెప్పారు. తన ఆదాయం ప్రస్తుతం రూ.1.5 లక్షలకు చేరిందని చెప్పారు. తన చెల్లె ఆదాయం నెలకు రూ.78 వేలుగా ఉంటుందని అన్నారు.

11 సంవత్సరాల చదువు తరువాత సర్జన్ అయ్యానన్న ఒక ధీమా తప్ప మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పారు. అప్పుల భారంతో పాటు, తనకంటూ సొంత ఆస్తి కూడా లేకపోవడంతో తనకు పిల్లనిచ్చే వారు ఎవరూ ఉండరని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎక్కువగా ఆందోళన చెందవద్దని అనేక మంది సూచించారు. ఆయన సర్జన్ అయినందున భవిష్యత్తుకు ఢోకా ఉండదని, కొన్నాళ్లు ఓపిక పడితే లైఫ్ సెట్ అవుతుందని భరోసా ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో ముచ్చట్లు.. అంతలోనే వచ్చిన రైలు..

జగన్నాథ రథయాత్ర: చిన్నారుల సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

Updated Date - Jul 18 , 2026 | 07:11 PM