Share News

రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో ముచ్చట్లు.. అంతలోనే వచ్చిన రైలు..

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:51 PM

ఫోన్ మాట్లాడుతూ.. లోకాన్ని మర్చిపోయిన ఓ యువకుడు ఎదురుగా రైలు వస్తూ.. హారన్ కొడుతున్నా పట్టించుకోకుండా రైల్వే ట్రాక్‌పైనే కూర్చుండిపోయాడు. అంతలోనే అక్కడికి రైలు రావడంతో ఏం జరిగిందంటే..

రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో ముచ్చట్లు.. అంతలోనే వచ్చిన రైలు..
Uttar Pradesh News

ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ మాట్లాడుతూ.. లోకాన్ని మర్చిపోయిన ఓ యువకుడు ఎదురుగా రైలు వస్తూ హారన్ కొడుతున్నా పట్టించుకోకుండా రైల్వే ట్రాక్‌పైనే కూర్చుండిపోయాడు. చివరకు డ్రైవర్ రైలు ఆపి, రాయి విసరడంతో భయంతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై రైలు వస్తోంది. లోకో పైలట్ యువకుడిని గమనించి హారన్లు కొడుతున్నప్పటికీ, ఆ యువకుడు అవేమీ పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాక్ పైనే కూర్చుండిపోయాడు. సాధారణంగా రైల్వే ట్రాక్‌లపైకి వెళ్లవద్దని అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఇలాంటి కొందరు నిర్లక్ష్యంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


ఆ యువకుడు ఎంతకీ ట్రాక్ పైనుంచి పక్కకు జరగకపోవడంతో.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. రైలు ఆగిన తర్వాత కూడా ఆ యువకుడు ఫోన్ మాట్లాడుతూనే ఉండటంతో లోకో పైలట్.. కిందకు దిగి కింద ఉన్న ఒక రాయిని తీసుకుని యువకుడిపైకి విసిరాడు. ఆ రాయి తగలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యువకుడు, ఎదురుగా ఉన్న రైలును చూసి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: మంత్రి తుమ్మల

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. రేవంత్‌కు కేటీఆర్ వార్న్

Updated Date - Jul 18 , 2026 | 06:40 PM