జగన్నాథ రథయాత్ర: చిన్నారుల సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 18 , 2026 | 03:19 PM
దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, కొందరు చిన్నారులు కలిసి చేసిన జగన్నాథుడి రథయాత్ర వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో గురువారం నాడు ఈ మహా ఉత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వనాలు, శంఖ నాదాల మధ్య జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒడిశాతో పాటు దేశంలోని నలుమూలలా ఈ పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ ఆధ్యాత్మిక సంబరాల నడుమ కొందరు చిన్నారులు బొమ్మలతో చేసిన జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రథాన్ని లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. కొంతమంది చిన్నారులు తమ సృజనాత్మకతను జోడించి జగన్నాథుని రథయాత్రను లాగుతున్నారు. ఒక చిన్న ఆటబొమ్మ ట్రక్కును జగన్నాథ రథంగా మార్చేశారు. బొమ్మలతో తయారు చేసిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించారు. ఓ తాడుకు పూలు, రంగు కాగితాలు అతికించి రథాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో లాగుతూ వేడుక జరిపారు. చిన్నారుల కళాత్మకత, నిష్కల్మషమైన భక్తిభావం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ పండుగల గొప్పతనాన్ని, సంస్కృతిని నేటి తరం పిల్లలు ఇంత చక్కగా అర్థం చేసుకుని ఆచరించడం అభినందనీయమంటూ వేలాది మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫేక్ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు