వైరల్ వెనుక నిజం.. పెళ్లి ఇష్టం లేక గుండు? రూమర్లపై యువతి క్లారిటీ
ABN , Publish Date - Jul 15 , 2026 | 08:50 AM
అరేంజ్‌డ్ మ్యారేజ్ ఇష్టం లేక ఓ యువతి గుండు గీయించుకుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై కంటెంట్ క్రియేటర్ కీర్తన మీనన్ స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని, అది కేవలం తన సొంత నిర్ణయమని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో ఓ యువతి తన తల్లి కుదిర్చిన పెళ్లిని తప్పించుకునేందుకు గుండు గీయించుకుందనే వార్త విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ చూసి నెటిజన్లు నిజమేనని నమ్మేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు చేసిందంటూ వేల సంఖ్యలో షేర్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే.. ఈ వైరల్ వీడియో వెనుకున్న కంటెంట్ క్రియేటర్ కీర్తన మీనన్ ఆ పుకార్లకు చెక్ పెట్టారు. తాను పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోకు ‘పీఓవీ: మై మామ్ ప్లాన్‌డ్ మై మ్యారేజ్’ అని సరదాగా పెట్టిన క్యాప్షనే ఈ గందరగోళానికి కారణమని ఆమె వివరించారు. ఆ మాటలను జనం సీరియస్‌గా తీసుకోవడంతో కథ పూర్తిగా మారిపోయిందన్నారు.
తనపై వస్తున్న రూమర్స్, ఫాలోవర్ల మెసేజ్‌లకు క్లారిటీ ఇచ్చేందుకు యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు కీర్తన. కోయంబత్తూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు.. అక్కడి భద్రకాళి అమ్మవారి గుళ్లో మొక్కుబడి మేరకే అలా చేయించుకున్నట్టు స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పెళ్లి ఒత్తిడి అంతకన్నా లేదని చెప్పారు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా, మనసుకు నచ్చినట్లు జీవించాలని ఆమె ఈ సందర్భంగా నెటిజన్లకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కేవలం ఓ సరదా క్యాప్షన్ కారణంగా.. సాధారణ వ్యక్తిగత నిర్ణయాలు ఎంతలా తప్పుగా ప్రచారమవుతాయో చెప్పేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..
వయసు సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..