భారత సంతతి బాలిక ఘనత.. యూఎస్ నేవీ క్యాడెట్స్‌కు నాయకత్వం వహించే ఛాన్స్
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:24 PM
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిద్ధీ చౌహాన్ తన స్కూల్‌లోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్‌జేఆర్‌ఓటీసీ) యూనిట్‌కు నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 17 ఏళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. క్వీన్స్ రాష్ట్రంలోని ఉంటున్న రిద్ధీ చౌహాన్ తన స్కూల్‌లోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్‌జేఆర్‌ఓటీసీ) యూనిట్‌కు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. స్కూల్‌ల్లోని మొత్తం 300 మంది యూఎస్ నేవీ క్యాడెట్స్‌కు రిద్ధీ నాయకత్వం వహించనుంది. సూల్ విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూఎస్ నేవీ ఈ ఎన్‌జేఆర్‌ఓటీసీ (భారత్‌లోని ఎన్‌సీసీ తరహా ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని నిర్వోహిస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రిద్ధీ చౌహాన్ ఇప్పటికే యూఎన్ నేవల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్‌లో అడ్మిషన్ సాధించింది. నేవీలో కమాండింగ్ ఆఫీసర్ అవకాశం దిశగా తొలి అడుగు వేసింది. ఫ్రెష్‌మన్ ఇయర్‌లో (9వ తరగతి) ఉండగా రిద్ధీ ఎన్‌జేఆర్ఓటీసీ ప్రోగ్రామ్‌లో చేరింది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఆమె ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంది. ఆ తరువాత స్కూల్లో ఎన్‌జేఆర్ఓటీసీ యూనిట్‌కు అకాడమిక్ కమాండర్‌గా, స్టెమ్ కమాండర్‌గా, ప్లటూన్ లీడర్‌గా, ఇన్‌స్ఫెక్షన్ కమాండర్‌గా పలు బాధ్యతల్లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుని బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయ్యింది. ఈ బాధ్యతల్లో ఆమె ప్రతి రోజూ 300 మంది క్యాడెట్స్‌కు శిక్షణ కార్యక్రమాల్లో నాయకత్వం వహించడంతో పాటు జూనియర్ క్యాడెట్స్‌కు మార్గనిర్దేశనం కూడా చేస్తోంది. యూఎస్ నేవీలో చేరడమే తన లక్ష్యమని రిద్ధీ తెలిపింది. రిద్ధీ తల్లిదండ్రులు దిలీప్ చౌహాన్, రుచికా చౌహాన్‌లు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వారు.
ఈ వార్తలనూ చదవండి:
మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన గాలులు.. వీడియో వైరల్
కెనడా అడవుల్లో కార్చిచ్చు కలకలం.. రైలును చుట్టుముట్టిన భయానక మంటలు