Share News

కెనడా అడవుల్లో కార్చిచ్చు కలకలం.. రైలును చుట్టుముట్టిన భయానక మంటలు

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:23 PM

కెనడా ఒంటారియోలో అడవి మంటలు రైలును చుట్టుముట్టాయి. క్యాబ్ కిటికీల నుంచి పొగ, మంటలతో కూడిన భయానక వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి.

కెనడా అడవుల్లో కార్చిచ్చు కలకలం.. రైలును చుట్టుముట్టిన భయానక మంటలు
Canada Wildfire

ఇంటర్నెట్ డెస్క్: కెనడా ఒంటారియోలో అడవి మంటలు రైలును చుట్టుముట్టాయి. క్యాబ్ కిటికీల నుంచి దట్టమైన పొగ, మంటలు వ్యాపిస్తున్న భయానక వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆ రైల్లో ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ఈ ఊహించని ప్రమాదం కారణంగా రైల్వే కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.


ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైలు లోకోమోటివ్ క్యాబ్ లోపలి నుంచి సిబ్బంది చిత్రీకరించిన ఈ ఫుటేజీలో.. పట్టాలకు ఇరువైపులా ఎత్తైన ఎర్రటి మంటలు, దట్టమైన పొగ రైలును కమ్మేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కిటికీల గుండా చూస్తే బయట ప్రపంచం మొత్తం ఓ ప్రళయ దృశ్యంలా కనిపించింది. ప్రాణభయంతో సిబ్బంది స్పందిస్తూ ‘ఇది మనల్ని కూడా ముంచేయగలదు’ అని ఆందోళన వ్యక్తం చేయడం వైరల్ వీడియోలో వినిపించింది. పర్యావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతున్న ఈ దృశ్యాలు నెటిజన్లను ఒకింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

నా వంట నేనే చేసుకుంటా.. తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ పిటిషన్

వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..

Updated Date - Jul 15 , 2026 | 02:09 PM