Home » International News
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..
కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న సూడాన్‌లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేసింది. ఆ కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు వచ్చింది.
అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలంటూ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆదేశాలపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ మంత్రి క్రిస్ రైట్ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండవని స్పష్టం చేశారు.
మెక్సికోలోని ఓ సూపర్‌మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికి పైగా గాయపడ్డారు.
యుద్ధానికి సిద్ధం కావాలంటూ మిలటరీకి కూడా ఆదేశాలిచ్చేశారు డోనాల్డ్ ట్రంప్. తనదైన స్టైల్లో సందేశమిచ్చారు. ఏదైనా అమెరికా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా" ఉంటుందని హెచ్చరించారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ , శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్, హ్యుందాయ్ ఛైర్మన్ చుంగ్ యుయి-సన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.
భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామంటూ చైనాపై అంతెత్తున లేచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అందుకు భిన్నంగా రాజీకి వచ్చారు....
గురువారం(అక్టోబర్ 30) నుంచి దక్షిణ కోరియాలోని బుసాన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్(అపెక్) సదస్సు జరుగుతుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని అమెరికా తెలిపింది.
తాను వచ్చే సంవత్సరం బంగ్లాదేశ్ లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఒకవేళ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమ లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని చెప్పారు.