ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 07:13 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ ఉద్యక్షుడు జెలెన్‌స్కీతో గురువారంనాడు సమావేశమయ్యారు.
దావోస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గురువారంనాడు సమావేశమయ్యారు. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఉభయులూ చర్చించనున్నారు. ఇందులో భాగంగా జెలెన్‌స్కీ గురువారం ఉదయమే స్విట్జర్లాండ్ చేసుకున్నారు. ట్రంప్‌తో సమావేశం అనంతరం ఆయన దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ప్రసంగిస్తారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గురువారం కానీ శుక్రవారం కానీ సమావేశమవుతాయని కూడా ట్రంప్ ఇంతకుముందు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం అతి చేరువలో ఉందన్నారు.
కాగా, జెలెన్‌స్కీతో సమావేశానికి ముందు 'గాజా శాంతి మండలి'ని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. గాజా పునర్మిర్మాణం, పాలనను పర్యవేక్షిచేందుకు ఏర్పాటు చేసిన శాంతి మండలిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో సహా 16 దేశాలు మండలిలో చేరుతూ సంతకాలు చేశాయి. ట్రంప్ ఇప్పటికే మండలిలో చేరాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 50 మందికి పైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ట్రంప్ 'బోర్డ్ ఆఫీ పీస్' సంతకాల సెర్మనీకి ఇండియాతో పాటు, యూకే, చైనా, జర్మనీ, మరికొన్ని కీలక దేశాలు దూరంగా ఉన్నాయి. అర్జెంటీనా, అర్మేనియా, అజెర్‌బైజాన్, బహ్రెయిన్, బెలారస్, ఈజిప్టు, హంగేరి, కజకిస్థాన్, మొరాకో, పాకిస్థాన్, యూఏఈ, సౌది అరేబియా, వియత్నాంలు 'గాజా శాంతి మండలి'లో చేరాయి. ట్రంప్ ఆహ్వానంపై జర్మనీ, ఇటలీ, పరాగ్వే, రష్యా, స్లొవేనియా, తుర్కియా, ఉక్రెయిన్ ఇంకా స్పందించాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
దావోస్ వేదికగా 'శాంతి బోర్డు'ను ప్రారంభించిన ట్రంప్.. సభ్యదేశంగా పాక్
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..