Share News

ట్రంప్ చెప్పినవన్నీ అబద్ధాలే.. మేం ఉరిశిక్షలు విధించలేదు.. ఇరాన్ ప్రాసిక్యూటర్

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:50 PM

అమెరికా ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గారని, 800 మంది ఉరిశిక్షలను రద్దు చేశారని కొద్ది రోజులుగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పష్టం చేశారు.

ట్రంప్ చెప్పినవన్నీ అబద్ధాలే.. మేం ఉరిశిక్షలు విధించలేదు.. ఇరాన్ ప్రాసిక్యూటర్
Iran prosecutor denies Trump

అమెరికా ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గారని, 800 మంది ఉరిశిక్షలను రద్దు చేశారని కొద్ది రోజులుగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పష్టం చేశారు. నిరసనకారులకు సామూహిక మరణశిక్షలు విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు (Iran prosecutor denies Trump).


'నిరసనకారులెవరికీ ఉరిశిక్షలు విధించలేదు. అసలు అన్ని వందల మందిని మేం అరెస్ట్ చేయలేదు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే. తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయవద్దని అంతర్జాతీయ మీడియాను కోరుతున్నాం' అంటూ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది సూచించారు. కాగా, ఇరాన్‌లోని వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి కారణంగానే అక్కడి అధికారులు రద్దు చేశారని ట్రంప్ పేర్కొన్నారు (800 executions claim).


తాను కల్పించుకోకపోయి ఉంటే ఇరాన్‌లో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ తెలిపారు (Donald Trump Iran protests). తన వల్ల ఆ నిరసనకారులు బతికిపోయారని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని తెలిపారు. ఆందోళనకారులను అణిచివేస్తోందనే కారణంతో ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇరాన్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్‌..


ట్రంప్ తీరు వల్ల అమెరికా ఇతర దేశాల విశ్వాసం కోల్పోతోంది.. జేపీ మోర్గాన్ విమర్శలు..

Updated Date - Jan 23 , 2026 | 05:55 PM