ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్..
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:39 PM
ఇరాన్‌లో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఆ దేశ నాయకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులను అణిచివేస్తోందనే కారణంతో ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
ఇరాన్‌లో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఆ దేశ నాయకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులను అణిచివేస్తోందనే కారణంతో ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇరాన్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని తెలిపారు (Donald Trump Iran). ట్రంప్ మాటలతో ఉద్రిక్తత నెలకొంటుందనే అంచనాలతో ఇజ్రాయెల్ అప్రమత్తమవుతోంది.
ఇరాన్‌కు ఎలాంటి నష్టమూ జరగకూడదని తాను భావిస్తున్నానని, అయితే అక్కడ ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగడం లేదని ట్రంప్ అన్నారు. అక్కడ పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్' ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి ముందుకు కదులుతోందని, అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పశ్చిమాసియాకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి (US armada Iran).
కాగా, ఇరాన్‌లోని వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి కారణంగానే అక్కడి అధికారులు రద్దు చేశారని ట్రంప్ పేర్కొన్నారు (US military warning Iran). తాను కల్పించుకోకపోయి ఉంటే ఇరాన్‌లో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. తన వల్ల ఆ నిరసనకారులు బతికిపోయారని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతుండడంతో ఇజ్రాయెల్ అయోమయానికి గురవుతోంది. ట్రంప్ చర్యలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళానికి గురవుతోంది. తనపై దాడి జరిగితే ఇరాన్ ఏదో ఒక రూపంలో రియాక్ట్ అవుతుందన్న అంచనాలతో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తత పాటిస్తోంది.
ఇవీ చదవండి:
తెలంగాణ ఇంటర్మీడియట్.. వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే