Home » India vs Pakistan
ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌తో సహా, ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా నెలల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ విషయంలో భారత ఆటగాళ్లు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు.
వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ నెల 31వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగగా, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ అఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం పాకిస్థాన్, భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఉగ్రదాడులతో భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాాజాాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది..
భారత్-పాకిస్థాన్ పోరుకు అంతా సిద్ధమవుతోంది. త్వరలో ఈ రెండు జట్లు మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఈ సమరం ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..